: కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత సైన్యం మట్టుబెట్టిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో అక్కడ విధించి కర్ఫ్యూ ఆంక్షలను సడలించినట్లు అధికారులు పేర్కొన్నారు. 74 రోజులపాటు కొనసాగుతున్న కర్ఫ్యూను ఎత్తివేయడంతో ఆ రాష్ట్రంలో నివసిస్తోన్న సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఉండబోవని అధికారులు తెలిపారు. ఆందోళనల కారణంగా జవాన్లు జరిపిన కాల్పుల్లో మొత్తం 81 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు గాయాలపాలయ్యారు.