: ఢిల్లీలో టీచర్‌ని పొడిచిన తర్వాత రాక్షసానందంతో చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసిన యువకుడు
దేశరాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై ప్రేమోన్మాది సురేందర్‌సింగ్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న కరుణ(21)ను దారుణంగా 22 సార్లు కత్తితో పొడిచి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ రాక్షసుడి కోసం గాలిస్తున్నారు. అయితే, యువతిని కత్తిపోట్లు పొడిచిన తరువాత సురేందర్‌సింగ్ అక్కడే నిలబడి కొద్దిసేపు డ్యాన్స్ చేశాడట. రాక్షసానందంతో నిందితుడు డ్యాన్స్ చేస్తుంటే తాను చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. యువతిపై దాడి చేసి తన కసితీర్చుకున్నాక ఆ యువకుడు ఆమె మృతదేహం చుట్టూ తిరుగుతూ ఇలా డ్యాన్స్ చేశాడని చెప్పాడు. యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించాలని చూసినట్లు సదరు సాక్షి చెప్పాడు. అయితే, తనకు మద్దతుగా రోడ్డుపై వెళ్లేవారు ఎవరూ రాలేదని పేర్కొన్నాడు. ఈ ఘటనపై నార్త్ ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయురాలు కరుణ మరో యువకుడితో ప్రేమలో ఉందని భావించిన సురేందర్‌సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు.