: నెట్టింట 'బాహుబలి-2' లోయ, గుహ లొకేషన్ చిత్రాలు లీక్... మీరూ చూడండి!


బాహుబలి-2 చిత్రం గురించిన ఏ విశేషం బయటకు వచ్చినా అది ఇంటర్నెట్ లో శరవేగంగా దూసుకెళుతుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటున్న వేళ సైతం, సినిమా గురించిన ఏ విధమైన సమాచారం బయటపడకుండా దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటుండగా, తాజాగా సినిమా షూటింగ్ లొకేషన్ కు చెందిన కొన్ని చిత్రాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. భారీ కొండల మధ్య ఉన్న ఓ పెద్ద లోయలో యుద్ధానికి అవసరమైన పరికరాలు తయారు చేస్తున్నట్టుగా ఈ చిత్రంలో కనిపిస్తోంది. ఓ పెద్ద ఇనుప గేటు అడ్డుగా ఉన్న గుహ, దాని ముందు చిన్న నీటి కొలను కనిపిస్తున్నాయి. ఇక ఈ గుహ దగ్గర తీసిన సీన్ ఏంటో సినిమా రిలీజయ్యాక తెలుసుకోవచ్చు. అప్పటివరకూ ఈ గుహ ఫోటోను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

  • Loading...

More Telugu News