: అవును, నా పేరు మహ్మద్ కైఫ్...కానీ నేను షార్ప్ షూటర్ ని కాదు: అయోమయానికి తెరదించిన క్రికెటర్ కైఫ్


జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్ బెయిల్ పై విడుదలైన సందర్భంగా అతని పక్కన, బీహార్ జర్నలిస్టు రాజ్ దేవ్ రంజన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ కనిపించడంతో పెను దుమారం రేగింది. హంతకుడు అంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో టీమిండియా అభిమానులు పలువురు గందరగోళానికి గురయ్యారు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ షార్ప్ షూటర్ ఎప్పుడయ్యాడంటూ పలువురు ఆరాతీయడం ప్రారంభించారు. కొంత మంది నేరుగా అతని నివాసానికే ఫోన్ చేసి, సందేహం తీర్చుకున్నారు. ఈ అనుమానాలు మరింత పెరిగిపోతుండడంతో మహ్మద్ కైఫ్ మీడియా ముందుకు వచ్చాడు. తన పేరు మహ్మద్ కైఫ్ అని. తాను టీమిండియా క్రికెటర్ ని అని స్పష్టం చేశాడు. అయితే తనకు, షార్ప్ షూటర్ కు సంబంధం లేదని, తాను బ్యాటుతో బంతిని షూట్ చేసే వ్యక్తినే కానీ, తుపాకులతో మనుషులను చంపే వ్యక్తిని కాదని చమత్కరించాడు. పలువురు నేరుగా తనకే ఫోన్ చేసి ఈ విషయం అడగడంతో దీనిపై వివరణ ఇస్తున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News