: నయీమ్ దందాలో 30 మంది పోలీసులకు నోటీసులు సిద్ధం!


గ్యాంగ్ స్టర్ నయీమ్ అక్రమాల వెనుక తమవంతు సహకారాన్ని అందించిన ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని 30 మంది పోలీసు అధికారులకు సిట్ బృందం నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరందరి ప్రమేయంపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన బృందం వీరిని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తోంది. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల నుంచి సీఐ, ఎస్ఐల వరకూ ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. నయీమ్ కేసు విచారణ బాధ్యతలను సీనియర్ ఆఫీసర్ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో కొంతమంది పదవీ విరమణ చేసిన వారికీ నోటీసులు పంపనున్నట్టు సమాచారం. నయీమ్ వెనుక అండగా ఉన్నారని, దందాల్లో పాలుపంచుకున్నారని ఇప్పటికే పలువురు రాజకీయ నేతల పేర్లు బయటకు రాగా, వారంతా వాటిని ఖండించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News