: త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణలో త్వరలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు బీసీ సంక్షేమంపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల పురోగతి అవసరమన్నారు. బీసీ కులాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని, బీసీ స్టడిల్ సర్కిల్ లో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.