: హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై కేటీఆర్ సమీక్ష.. 150 బృందాలుగా ఏర్పడి పనులు చేయాలని ఆదేశం
చినుకుపడితే చిత్తడిగా మారుతోన్న హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగర్‌లో రోడ్ల మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన ప్రణాళికను కేటీఆర్‌కు అందించినట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన కేటీఆర్.. 150 బృందాలుగా ఏర్పడి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు.