: పాక్‌ను ఏం చేద్దాం?.. ఢిల్లీలో మరోసారి అధికారులతో భేటీ అయిన రాజ్‌నాథ్‌సింగ్
జమ్ముకశ్మీర్‌లోని యూరిలో ఉగ్రవాదులు చొరబడి భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నతాధికారులతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పాక్‌పై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో పలుసార్లు చర్చించిన ఆయన.. ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్, ఐబీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భారత్‌ను రెచ్చగొడుతూ పాక్ పాల్పడుతున్న దుస్సాహసానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోన్న భారత్ అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది.