: సరిహద్దులు దాటే ఉగ్రవాదులనే కాదు, దేశంలోని దోమలనే తరమలేకపోతున్నారు: గౌతమ్ గంభీర్ ఎద్దేవా
స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఉగ్రదాడులపై స్పందిస్తూ, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శించాడు. ఉగ్రదాడులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న పాక్ పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేకపోవడాన్ని దుయ్యబట్టాడు. ఉగ్రవాదులను దోమలతో పోలుస్తూ, "నా బాధ ఏంటంటే మన నేతలు సరిహద్దులు దాటి వచ్చే దోమలను ఆపలేకపోతున్నారు సరికదా, దేశంలోని దోమలను కూడా తరమలేకపోతున్నారు" అంటూ ఇటీవలి వర్షాల తరువాత ఢిల్లీలో నిలిచిన నీరు, ఆపై ప్రబలిన డెంగ్యూ, చికున్ గున్యాలను గుర్తు చేశాడు. గంభీర్ పెట్టిన ఈ ట్వీట్ ను వెయ్యి మందికి పైగా రీ ట్వీట్ చేయడం గమనార్హం.