: శ్రీకాకుళం జిల్లాలో బ్లూఫిలింల చిత్రీకరణ.. యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్!
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎక్కడ చూసినా బ్లూఫిలింల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పట్టణానికి చెందిన కొందరు యువకులు ఈ బ్లూఫిలింలు చిత్రీకరించి విడుదల చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆముదాలవలస, పరిసర ప్రాంతాల్లో వీటిని చిత్రీకరిస్తున్నట్టు వార్తలు రావడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సినిమాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ తెలిసినవారేనని చెబుతున్నారు. పట్టణానికి చెందిన మహిళలతోనే ఈ వీడియోలను చిత్రీకరించాని తెలుస్తోంది. ఈ బ్లూఫిలింలు ఇప్పుడు యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్ చేస్తున్నాయి. బ్లూఫిలింలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా పోలీసులు ఆ వైపుగా దృష్టి సారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచీ భయమేస్తోందని ఆడపిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. పట్టణంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లూఫిలింల వ్యవహారంపై స్థానిక సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.