: బీహార్ రోడ్డు ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య.. రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం


బీహార్‌లోని మధుబని జిల్లా బస్కాచౌ గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికి తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఆలస్యంగా మొదలు కావడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News