: నోరు జారిన ఝాన్సీ... నవ్వుకున్న సభికులు!
ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాసుకు తిరుపతిలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ... అత్యుత్సాహంతో గాయకుడు ఏసుదాసును అతని ముందే ఖూనీ చేసింది. 'మనలో ఒకడు' సినిమా ఆడియో సక్సెస్ మీట్ సందర్భంగా ఝాన్సీ ఆయనను పొగుడుతూ, 'అమర గాయకుడు ఏసుదాసు గారు' అని సంబోధించింది. దీంతో అక్కడున్న పలువురు నవ్వుకున్నారు. వేదికపై ఉన్న మరికొందరు అవాక్కయ్యారు. దానిని గుర్తించని ఝాన్సీ అదే ఫ్లోను కొనసాగించుకుంటూ మాట్లాడేసింది. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.