: కలకలం రేపుతున్న ‘కలియుగంలో తాగుబోతుడి మ్యారేజ్’ ఫ్లెక్సీ!


కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ‘కలియుగంలో తాగుబోతుడి మ్యారేజ్’ అనే పేరుతో వెలిసిన ఈ ఫ్లెక్సీకి బాధ్యులెవరో తెలియదు. ఇదే ఫ్లెక్సీలో జాతిపిత మహాత్మాగాంధీ ఫొటోతో పాటు, 'మహాత్మాగాంధీ వైన్ షాపు' అని కూడా రాసి ఉన్నాయి. అంతేకాకుండా, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో పాటు మరి కొందరి ఫొటోలను కూడా ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. ‘జాతిపిత’ను అవమానపరిచే విధంగా ఉన్న ఈ ఫ్లెక్సీపై స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫ్లెక్సీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News