: ఈ ఫోటో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: వీరేంద్ర సెహ్వాగ్


యూరీ ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల మృతదేహాలన్నీ ఒకే వరుసలో పేర్చి వాటిపై జాతీయ పతాకాలను కప్పిన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులోని భావోద్వేగాన్ని బయటపెట్టారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ... "17 మంది ప్రాణాలు. వారికీ కుటుంబాలున్నాయి. వాళ్లకూ కొడుకులున్నారు. కూతుళ్లున్నారు. వారు మాతృభూమికోసం సేవ చేశారు. ఈ దృశ్యం చూసేందుకు బాధగా ఉంది. యూరీ దాడి ఘటన విని నా గుండె తరుక్కుపోతోంది. దాడి చేసిన వారు తిరుగుబాటుదారులు కాదు. వారు ఉగ్రవాదులే. ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇచ్చితీరాలి" అని అన్నాడు.

  • Loading...

More Telugu News