: ప్రకటనలు చేయడంతో సరిపెట్టొద్దు...పాక్ దవడ పగులగొట్టాల్సిందే: బాబా రాందేవ్


జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో సైనికులపై పంజా విసిరిన ఉగ్రవాదులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటనపై ప్రముఖ యోగా సాధకుడు బాబా రాందేవ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా జరిగిన ఘటనపై ప్రకటనలు చేయడంతో సరిపెట్టవద్దని ఆయన తెలిపారు. పాకిస్థాన్ దవడ పగులగొట్టే జవాబివ్వడం మాత్రమే కాదని, నిజంగానే పాకిస్థాన్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దవడ పగులగొట్టాలని ఆయన సూచించారు. అయితే యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదన్న సంగతి తనకు తెలుసని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News