: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఇంక్ ఎందుకు చల్లానన్న విషయం చెప్పిన నిందితుడు


ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియాపై ఇంక్ చల్లిన యువకుడు బ్రజేష్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, తానెందుకు ఆ పని చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని అతను వివరించాడు. "ఢిల్లీ ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. ఫిన్ ల్యాండ్ లో తిరుగుతూ సముద్రాల వద్ద ఫోటోలు దిగుతున్నారు. మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. మళ్లీ ఢిల్లీకి వచ్చి గత పాలకులను విమర్శిస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిన్న ఢిల్లీకి వచ్చిన ఆయనకు, నేటి మధ్యాహ్నం వరకూ లెఫ్టినెంట్ గవర్నర్ తో సమావేశమయ్యేందుకు సమయం చిక్కలేదు. వీరేనా పాలకులు? అందుకే నా నిరసన తెలియజేశాను" అని అన్నాడు. తనపై ఇంక్ చల్లిన ఘటన వెనుక బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్ర ఉందని మనీష్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News