: యూరిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన బీహార్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు
జమ్ముకశ్మీర్‌లోని యూరిలో నిన్న ఉగ్రవాదులు ప్రవేశించి 20 మంది సైనికుల ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. ఘటనలో మరో 17 మంది జవాన్లు శ్రీనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో అమరులైన బీహార్‌కు చెందిన జవాన్ల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పరిహారం ప్రకటించింది. వీరమరణం పొందిన బీహార్‌కు చెందిన జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుభార్ దాస్ కూడా తమ రాష్ట్రానికి చెందిన అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.