: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సిరా దాడి
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై గుర్తుతెలియని వ్యక్తి సిరా దాడి చేశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇంటి ముందు ఈరోజు ఈ ఘటన జరిగింది. ఓ వైపు ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపిస్తోంటే, మరోవైపు సిసోడియా రాష్ట్రంలో అందుబాటులో లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఫిన్‌లాండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన సిసోడియా నజీబ్ జంగ్‌తో ముచ్చటించడానికి రాజ్‌భవన్ కు వచ్చారు. ఈ సమయంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో షాక్ తిన్న మంత్రి వెంటనే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.