: ప్రతి దాడా? వేచి చూసే ధోరణా?... మోదీ ఏం చెప్పేనో?!


ఇండియాపై ఉగ్రదాడులకు పురిగొల్పుతున్న పాకిస్థాన్ వైఖరికి ఎలా బుద్ధి చెప్పాలన్న విషయమై కీలక సమావేశం ప్రారంభమైంది. నిన్నటి యూరీ ఆర్మీ కేంద్రంపై ఉగ్రదాడి నేపథ్యంలో కొద్దినేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. మోదీ నివాసానికి కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు చేరుకోగా, ప్రతిదాడులు ఎలా చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీలతో పాటు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు మోదీని కలిసి చర్చించే వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో పోలిస్తే పాక్ వైఖరిపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కరుకుగా వ్యవహరిస్తుందన్న నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు కీలకం కానున్నాయి. ప్రతిదాడులు చేయాలా? లేక వేచి చూసే ధోరణిలో ఇంకొంత కాలం వ్యవహరించి, అంతర్జాతీయ వేదికలపై పాక్ వైఖరిని ఎండగట్టాలా? అన్న విషయంలో మోదీ ఏం చెబుతారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News