: భారత్‌ను అస్థిరపరచడానికి పాక్ కుట్ర: వెంకయ్యనాయుడు
జమ్ముకశ్మీర్‌లోని యూరిలో నిన్న నిద్రిస్తున్న సైనికులపై దొంగదెబ్బ తీసి ఉగ్రవాదులు 20 మంది జవాన్ల మృతికి కారణమైన ఘటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. సైనికులపై దాడి దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు. దాయాది పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీన్ని భారత్ ఏ మాత్రం సహించబోదని పేర్కొన్నారు. భారత్‌ను అస్థిరపరచడానికి పాక్ కుట్ర చేస్తోందని అన్నారు. పాకిస్థాన్ కుట్రలపై ప్రపంచవ్యాప్తంగా ముక్తకంఠంతో గళం విప్పాలని కోరారు. సైనికులపై దాడి క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు. కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, ఉగ్రవాదులను శిక్షిస్తుందని చెప్పారు.