: కారు బీభత్సం... తాగిన మత్తులో 12 ఆటోలను ఢీ కొట్టిన విద్యార్థి
పీకలదాకా తాగిన ఓ విద్యార్థి కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం అతి వేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న 12 ఆటోలపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆటోలన్నీ ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్‌కి తీవ్రగాయాలు కావడంతో మృతి చెందాడు. ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్‌ను అరుముగమ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనకు పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థి పేరు వికాస్ విజయానంద్ అని పోలీసులు తెలిపారు.