: మావోయిస్టుల షాకింగ్ ప్రకటన.. కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు తెలుపుతున్నట్టు లేఖ
కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నట్టు ఆంధ్రా-ఒడిశా మావోయిస్టు కమిటీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. 70 వేలమంది యువకులను ప్రభుత్వం కిరాయి మూకలతో చంపించిందని లేఖలో పేర్కొంది. ఇంకా కశ్మీర్‌లో లెక్కలేనన్ని అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయంటూ ఆరోపించింది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ సమస్యను తెరపైకి తీసుకొచ్చిందంటూ తీవ్రస్థాయిలో విమర్శించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదమంటూ ప్రచారం అందులో భాగమేనని లేఖలో మావోలు పేర్కొన్నారు.