: బిర్యానీతో పాటు 100 రూపాయల కోసం 42 బస్సులను తగులబెట్టించిన భాగ్య!


గతవారం కర్ణాటకలో జరిగిన విధ్వంసం వెనుక కారకులంటూ దాదాపు 400 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వారిలో ఉన్న ఒకే ఒక్క యువతి భాగ్య (25) బిర్యానీ, రూ. 100 కోసం 42 బస్సులను తగులబెట్టించిందని తెలుస్తోంది. డబ్బిచ్చి ఆమెను విధ్వంసానికి ప్రేరేపించినట్టు తెలుస్తుండటంతో, దీని వెనుక కుట్ర కోణం ఉందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. కేపీఎన్ బస్ గ్యారేజ్ కి సమీపంలోని గిరినగర్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న భాగ్య వద్దకు కొంతమంది వచ్చి బిర్యానీ పెట్టించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్పష్టం చేసిన భాగ్య తల్లి ఎల్లమ్మ, రూ. 100 ఇచ్చిన వారు తన కుమార్తెను నిరసనల్లో పాల్గొనేందుకు తీసుకువెళ్లారని వెల్లడించింది. తన కుమార్తెతో పాటు పలువురు మహిళలూ వారిలో ఉన్నారని చెప్పింది. సీసీటీవీ ఫుటేజీల్లో మరికొందరు మహిళలు కనిపిస్తున్నా, బస్సుల దహనం వెనుక వారి ప్రమేయంపై మాత్రం ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. బస్సు డిపోపై దాడికి వెళ్లిన భాగ్య, తనతో వచ్చిన వారిని రెచ్చగొట్టినట్టు కేపీఎన్ ఉద్యోగులు తీసిన మొబైల్ వీడియోల్లో కనిపిస్తోంది. తమపైనా డీజిల్ పోసిన నిరసనకారులు, తమకు అడ్డొస్తే తగలబెడతామని బెదిరించడంతోనే ఏమీ చేయలేకపోయామని వారు పోలీసులకు తెలిపారు.

  • Loading...

More Telugu News