: 2009 తర్వాత కేసీఆర్ చేసిందేమీ లేదు: ఉండవల్లి
తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఎంపీల వల్లే సాధ్యమైందని, 2009 తర్వాత కేసీఆర్ చేసిందేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘తెలంగాణ సాధన కోసం చేసిందంతా తెలంగాణ ఎంపీలే. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయన్ని హైలైట్ చేశారని జైపాల్ రెడ్డి కూడా చెప్పారుగా. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, ఎందుకు బయటపెట్టలేదంటే తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందని జైపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారు’ అని ఉండవల్లి నాటి విషయాలను గుర్తు చేశారు.