: ‘ఉగ్ర’ దాడికి పాల్పడింది జైష్-ఈ-మహమ్మద్: డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్
జమ్మూకాశ్మీర్ లోని యురి సెక్టార్ పై ‘ఉగ్ర’ దాడి వెనుక జైష్-ఈ-మహమ్మద్ పాత్ర ఉన్నట్లు తమ ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ధారణ అయిందని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. ‘ఉగ్ర’ దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి వెనుక విదేశీ ఉగ్రవాదుల పాత్ర ఉందని, సంఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 లు, నాలుగు గ్రెనేడ్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. టెంట్ లో మంటల కారణంగా 13, 14 మంది జవాన్లు మరణించారని రణ బీర్ సింగ్ తెలిపారు.