: తమన్నాలా సౌత్ ఇండియాలో మరెవరూ డ్యాన్స్ చేయలేరు: ప్రభుదేవా


‘అభినేత్రి చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేసినట్లుగా సౌత్ ఇండియాలోని ఏ హీరోయిన్ కూడా చేయలేదు’ అని ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో తమన్నా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందన్నారు. ‘ఒక ఫుల్ సాంగ్ కు మూడు రోజుల్లో తమన్నా డ్యాన్స్ నేర్చుకుంది. ఇప్పుడున్న వాళ్లలో అలాంటి డ్యాన్స్ సౌత్ ఇండియాలో ఎవరూ చేయలేరు... తమన్నా అద్భుతంగా చేసింది. హీరో లేదా హీరోయిన్ ఎవరికైనా డ్యాన్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఇంట్రస్ట్ ఉంటే చాలు. ఏ కొరియోగ్రాఫర్ కైనా అది ఎనర్జీ.. బూస్ట్ లా పనిచేస్తుంది. అభినేత్రి సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫన్ ఫిల్మ్’ అని అన్నారు. ‘ఒక డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనే ఉంది, కానీ, ఇంకా నో ఐడియా.. త్వరలోనే స్టార్ట్ చేస్తాను’ అని ప్రభుదేవా చెప్పారు. కాగా, తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో ‘అభినేత్రి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News