: రిషికపూర్ అమర్యాదగా ప్రవర్తించలేదన్న విలేకరి
ముంబయిలో వినాయక నిమజ్జనం సమయంలో కపూర్ సోదరులు మీడియాపై దురుసుగా ప్రవర్తించారనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలు అవాస్తవమంటూ నిమజ్జన సమయంలో అక్కడ ఉన్న విలేకరి పేర్కొన్నాడు. రణ్ బీర్ కపూర్ ను ఫొటోలు తీసుకునేందుకని వెళుతున్నానని, అయితే, అప్పటికే, రణ్ బీర్ కారులో కూర్చున్నాడని అన్నాడు. ఈలోగా కెమెరా వైరు కాలికి తగిలి తనంట తానే కిందపడ్డానని సదరు విలేకరి మీడియా ద్వారా వెల్లడించాడు. తీసిన వీడియోలను మార్చేసి విలేకరిని కొడుతున్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నాడు. నిమజ్జనం సమయంలో వర్షం పడుతోందని, వందలాది మంది గుమిగూడటంతో రిషిక పూర్ కొంచెం చికాకు పడ్డారు తప్పా, చేయిచేసుకోలేదని, అమర్యాదగా ప్రవర్తించలేదని ఆ విలేకరి చెప్పాడు.