: ఐఫోన్ 7 కోసం 18 గంటలపాటు వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు!
ఐఫోన్ 7 ను సొంతం చేసుకోవడం కోసం ఒక యువకుడు 18 గంటల పాటు వర్షంలో తడుస్తూ పడిగాపులుగాచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఐఫోన్ 7 ప్రారంభ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఐఫోన్ 7 లాంచ్ అవుతోందని తెలుసుకున్న బ్యాంకాక్ కు చెందిన టామ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. థాయ్ లాండ్ దేశానికి చెందిన ‘ఐఫోన్ మోడ్’ అనే న్యూస్ వెబ్ సైట్ లో పనిచేస్తున్న అతను సుమారు 800 డాలర్లు ఖర్చు చేసి సిడ్నీ చేరుకున్నాడు. వర్షంలో తడుస్తూ, 18 గంటలపాటు రోడ్డుపైనే గడిపానని టామ్ తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. తనతో పాటు మరో 200 మంది కూడా క్యూలో నిలబడ్డారని తెలిపాడు.