: సినిమా హీరోయిన్ కావాలా? టీవీ యాంకర్ కావాలా?... 'టెక్' సాయంతో అమరావతి ప్రాంతంలో పెచ్చుమీరిన వ్యభిచారం


నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలో పలువురు ధనవంతులు, బడాబాబుల సెల్ ఫోన్లకు కొత్తగా మెసేజ్ వస్తోంది. "సినిమా హీరోయిన్ కావాలా? ముంబై మోడల్ కావాలా? టీవీ యాంకర్ కావాలా? ఎవరైనా రెడీ. విందైనా, వినోదమైనా అమ్మాయిలున్నారు. మీరు ఎంచుకున్నాక రేటు... అందమైన వారెందరో ఉన్నారు" అన్నది దాని సారాంశం. రాజధానిగా ముస్తాబవుతున్న గుంటూరు, విజయవాడ మధ్య అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోవడం, ఎంతో మంది ధనవంతులు వచ్చి నివాసం ఉంటుండటంతో, ఎంపిక చేసుకున్న వారికి వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా, అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్ కు తెరదీశారు. టెక్నాలజీని వారి దందాకు వాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్ సంభాషణ 'సాక్షి' దినపత్రిక చేతికి చిక్కింది. దీనిలోని వివరాల ప్రకారం, ఫోటోను చూసి అమ్మాయి నచ్చితే వారు చెప్పిన అపార్ట్ మెంట్ కు వెళ్లాలి. అక్కడికి వెళ్లి చూస్తామంటే కుదరదు. మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి వంటి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి, వారు చెప్పిన అపార్ట మెంట్ కు వెళ్లి ఎంచుకున్న అమ్మాయితో ఒప్పందం ప్రకారం, గంటో, రెండు గంటలో గడపొచ్చు. ఒకవేళ అమ్మాయిని బయటకు తీసుకు వెళ్లాలన్నా పంపిస్తారు. అందుకు రేటు వేరే ఉంటుంది. గంటకు రూ. 10 వేల వరకూ చెల్లించాల్సి వుంటుంది. కాగా, గతంలో బీజేపీలో ఉండి వ్యభిచారం కేసుల్లో చిక్కుకున్న ఓ మహిళ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి, నేతల అండతో ఈ దందా సాగిస్తున్నట్టు 'సాక్షి' ఆరోపించింది. అందుకు సాక్ష్యాలున్నాయని సదరు పత్రిక చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News