: బారాముల్లాలో ముగిసిన ఎన్ కౌంటర్... ముష్కరమూక హతం


ఈ తెల్లవారుఝాము నుంచి జమ్మూకాశ్మీర్, బారాముల్లా ప్రాంతంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ ముగిసింది. పాక్ వైపు నుంచి చొరబడి సైన్యంపై కాల్పులకు దిగి, ఏడుగురు జవాన్లను పొట్టన బెట్టుకున్న ముష్కరమూక హతమైంది. ఎన్ కౌంటర్ ముగిసిందని, నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని, ఘటనా స్థలి నుంచి అత్యాధునిక ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఆర్మీ బెటాలియన్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 20 మందికి పైగా జవాన్లకు గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు హెలికాప్టర్లను, పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించామని వివరించారు. కాగా, న్యూఢిల్లీలో జమ్మూకాశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది.

  • Loading...

More Telugu News