: ప్రతి 10 అవినీతి కేసుల్లో ఏడు ప్రభుత్వోద్యోగులవే!
గడచిన దశాబ్ద కాలంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించిన అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైనవే అత్యధికం. ప్రతి 10 కేసుల్లో ఏడింట ప్రభుత్వోద్యోగులే నిందితులని లోక్ సభకు కేంద్రం అందించిన డేటాను విశ్లేషించిన ప్రజా సమాచార సేవల వెబ్ సైట్ 'ఫ్యాక్ట్లీ డాట్ కామ్' వెల్లడించింది. 2006 నుంచి సీబీఐ 7 వేలకు పైగా కేసులను విచారించగా, అందులో 6,533 కేసుల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని, వీటిల్లో 4,054 (68 శాతం) కేసుల్లో నిందితులు తప్పును ఒప్పుకున్నారని తెలిపింది. ఈ గణాంకాలను పరిశీలిస్తుంటే, ఇండియాలో కోర్టు కేసుల విచారణ చాలా ఆలస్యం అవుతుందన్న ఆలోచనను, నేర నిరూపణ చాలా కష్టమన్న అంచనాలను కొంత మార్చుకోవాల్సి వుంటుందని మాజీ ఇన్పర్మేషన్ కమిషనర్ శైలేష్ గాంధీ వ్యాఖ్యానించారు.