: చౌక దుకాణాల్లో పతంజలి ఉత్పత్తులు.. రంగం సిద్ధం చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం


ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఉత్పత్తులు ఇక రేషన్ షాపుల్లోనూ లభించనున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే మధ్యప్రదేశ్‌లోని 16వేల చౌక ధరల దుకాణాల్లో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వచ్చిన ఈ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. బాబా రాందేవ్ ఉత్పత్తులను చౌక ధరల దుకాణాల్లో విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకోవడమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా చేయడం వల్ల చిన్నిచిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రభుత్వం ‘బ్రోకర్’ పనులు మానేయాలని సూచించింది. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు మాత్రం విక్రయానికి ముందు పతంజలి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలని సూచించారు.

  • Loading...

More Telugu News