: జమ్ము ఆర్మీ హెడ్ కార్టర్స్‌పై ఉగ్రదాడి.. కొనసాగుతున్న కాల్పులు
కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి పాల్పడ్డారు. అధీన రేఖ సమీపంలోని యూరీ సెక్టార్‌లో ముఖ్యమైన సైనిక స్థావరంపై ముగ్గురు ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కాగా ఇటీవల ఓ నిర్మాణంలో ఉన్న భవంతిలోకి చొరబడిన ఉగ్రవాదులను ఆర్మీ ఏరివేసిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లకు మరింత ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నారు.