: హైదరాబాద్ సంస్థానం విలీన దినోత్సవంగా సెప్టెంబరు 17.. హైదరాబాద్ లో సీపీఐ భారీ బహిరంగ సభ
సెప్టెంబరు 17ను టీఆర్ఎస్ నేతలు తెలంగాణ విలీన దినోత్సవంగా, టీడీపీ-బీజేపీ నేతలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీపీఐ నేతలు ఈరోజును హైదరాబాద్ సంస్థానం విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీసీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి బహిరంగ సభకు హాజరయ్యారు. ఆయనతో పాటు సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, నారాయణ, టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం, సీపీఐ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొన్నారు.