: మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జ‌య‌నిలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది మృతి


మధ్యప్రదేశ్‌లో ఈరోజు తెల్లవారుజామున పెను రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉజ్జ‌య‌నిలో అతి వేగంతో ఎదురెదురుగా వస్తోన్న‌ రెండు వాహనాలు ఒక‌దానినొక‌టి ఢీ కొట్ట‌డంతో 8 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ప్ర‌మాదంలో మరో 14 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు గాయాల‌పాల‌యిన వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇరు వాహ‌నాలు టర్న్ తీసుకుంటుండగా ఢీకొన్నట్లు పోలీసులు మీడియాకు చెప్పారు. ఘ‌ట‌న ప‌ట్ల ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 లక్షల చొప్పున ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌మాదంలో గాయాల‌పాల‌యిన‌ వారికి రూ. 50,000 ఇస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News