: పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా కేంద్రం మరో అడుగు
పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా కేంద్రం మరో అడుగు వేసింది. దేశంలోని పేద ప్రజలకు ఆవాస్ యోజన నిధులతో పాటు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఎన్డీఏ సర్కారు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.70 వేల రుణసాయం అందనుంది. ఈ అంశంపై దేశంలోని బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. మరో 30 రోజుల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.