: కమ్యూనిస్టుల వల్ల టెన్షన్ పెరిగింది.. పెంచకుండా పంచితే పంచె మిగులుతుంది: వెంకయ్యనాయుడు
కమ్యూనిస్టుల వల్ల తయారీ, ఉత్పత్తి తగ్గి టెన్షన్ పెరిగిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అది పంచాలి, ఇది పంచాలి అంటూ వారు డిమాండ్ చేస్తుంటారని, ఏదైనా పెంచకుండా పంచితే చివరకు మిగిలేదని పంచేనంటూ చలోక్తులు విసిరారు. వర్కర్స్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా దత్తోపంథ్ తెంగడి జాతీయ బోర్డు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచమంతా మేడే రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని, కానీ మన దేశంలో విశ్వకర్మ జయంతి రోజున కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. ఇది మనకు సంప్రదాయంగా వచ్చిందన్నారు. కార్మికుడు, యజమాని రెండు చక్రాల్లాంటి వారని, వారు కలిసే ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడడం మంచిది కాదని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్న వెంకయ్య స్కిల్ ఇండియా పథకం ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు.