: చంద్రబాబు వియ్యంకుడిలా నేనేమీ రివాల్వర్ వాడను: ముద్రగడ పద్మనాభం


‘చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణలా నేనేమీ రివాల్వర్ వాడను’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, రాజమండ్రిలో తాము సమావేశం ఏర్పాటు చేసుకుంటే అడ్డంకులు సృష్టించారని, సమావేశం నిర్వహణకు మండపం ఇచ్చిన తన వియ్యంకుడికి నోటీసులు జారీ చేశారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తన వియ్యంకుడి రివాల్వర్ ను అప్పగించమంటూ పోలీసులు నిన్న కోరారని అన్నారు. తన వియ్యంకుడి రివాల్వర్ కు, తనకు సంబంధమేమిటని ముద్రగడ ప్రశ్నించారు. రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ అని, తానేమీ ఆయనలా రివాల్వర్ వాడనని అన్నారు. బాలకృష్ణ తన భార్య రివాల్వర్ ను కూడా వాడారని ఆరోపించారు. గతంలో ఆసుపత్రి అనే జైలులో తాను 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు కాలరాచారని మండిపడ్డారు. తనపై, తన అనుచరులపై వేధింపులు ఎక్కువయ్యాయంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News