: చైనాను అల్లకల్లోలం చేస్తున్న టైఫూన్ మెరాంటి.. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
చైనాను టైఫూన్ మెరాంటి అల్లకల్లోలం చేస్తోంది. దాని కారణంగా పుజైన్ ప్రావిన్స్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా ఆ ప్రాంతంలో 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జనం భయం గుప్పిట బతుకుతున్నారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టైఫూన్ మెరాంటి ధాటికి 8 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా ప్రజలకి గాయాలయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.