: అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు


అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌, సీఎం పెమాఖండూ 42 మంది సభ్యులతో క‌లిసి త‌మ పార్టీకి గుడ్ బై చెప్పిన అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈరోజు ఆయ‌న ఢిల్లీలో మాట్లాడుతూ... ఆ రాష్ట్రంలో ఏర్ప‌డిన రాజ‌కీయ సంక్షోభానికి కాంగ్రెస్ వైఫల్యమే కార‌ణ‌మ‌ని అన్నారు. ఈ అంశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని తప్పుపట్టే అంశం ఏదీ లేద‌ని వ్యాఖ్యానించారు. అరుణాచ‌ల్ ముఖ్య‌మంత్రి, మంత్రులు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని క‌ల‌సి చ‌ర్చించ‌డానికి ఎన్నో రోజులు నిరీక్షించార‌ని, అయినా వీరిని పట్టించుకోలేదని కిరణ్ రిజిజు విమ‌ర్శించారు. అందుకే ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు అంతాక‌లిసి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఇక ఆ పార్టీలో ఉండ‌లేక‌నే బ‌య‌టికొచ్చేశార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News