: టీమిండియాతో క్రికెట్ ఆడ‌డం కష్టమైన పని: ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ కోచ్‌ గ్రేమ్ హిక్ సూచన


ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ హిక్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మితుల‌య్యారు. ఉపఖండం మైదానాల్లో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న‌ నేపథ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... టీమిండియాతో సిరీస్‌లో పాల్గొనేందుకు చాలా ఓపిక కావాల‌ని వ్యాఖ్యానించారు. ఉప‌ఖండ పిచ్‌ల‌లో ఆడేందుకు అక్క‌డి పరిస్థితులకు అలవాటు పడాలని గ్రేమ్ హిక్ సూచించారు. టీమిండియాతో పోరాటం అంత తేలిక కాదని, అందులోనూ స్వదేశంలో టీమిండియాతో క్రికెట్ ఆడ‌డం కష్టమైన పనని పేర్కొన్నారు. రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవాల‌ని, దాని కోసం ఎంతో ఓపికతో ఉండాల‌ని చెప్పారు. ఈ విష‌యాల‌ని గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News