: ఎస్ఐ ఆత్మహత్య కేసులో డీఎస్పీ, సీఐలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?: హైకోర్టు
కుకునూరు ఎస్ఐ ఆత్మహత్య కేసులో డీఎస్పీ, సీఐలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను ఈ రోజు హైకోర్టు చేపట్టింది. తన భర్త ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి తనకు అనుమానాలున్నాయని, సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశించాలని ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. తనను డీఎస్పీ, సీఐలు వేధించారంటూ ఎస్ఐ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. వారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీస్ శాఖను ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.