: ఆధ్యాత్మిక గురువు వేషంలో మోహన్ లాల్!
ప్రముఖ దక్షిణాది నటుడు మోహన్ లాల్ తాను ఎంతగానో ప్రేమించే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఓషో (రజనీష్) వేషం ధరించారు. ఆ వేషంలో ఉన్న తన ఫొటోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఆయన రాశారు. ‘అనంతుడు, ప్రేమసాగరుడికి మారు వేషంలో’ అంటూ మోహన్ లాల్ పేర్కొన్నారు. కాగా, తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించారు.