: నేను, నాన్నా మాట్లాడుకున్నాం, బయటి వాళ్లు బయటే!: అఖిలేష్ కీలక వ్యాఖ్యలు


ఈ ఉదయం తన తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో మాట్లాడిన యూపీ సీఎం అఖిలేష్, తమ ఇంట్లో కలహాలకు తాజాగా పార్టీలో చేరిన అమర్ సింగ్ కారణమన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో చర్చల అనంతరం పార్టీలో, ప్రభుత్వంలో బయటి వారి ప్రమేయం ఉండరాదన్న నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇటీవలి వివాదాలకు బయటి వ్యక్తుల ప్రమేయం పెరగడం కూడా ఓ కారణమేనని టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అమర్ సింగ్ కు ప్రాతినిధ్యం పెరుగుతుండటం, ఇటీవల ఆయన ఇచ్చిన విందుకు ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వెళ్లడం, దాన్ని తేలికగా తీసుకోలేకపోయిన అఖిలేష్ ఆయనను మంత్రి పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆపై యూపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ములాయం స్వయంగా రంగంలోకి దిగి సోదరుడు, కుమారుడి మధ్య సఖ్యత తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News