: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఎత్తివేత


హైద‌రాబాద్‌లో గణ‌నాథుని విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుండ‌డంతో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ అంక్షలు విధించిన సంగ‌తి తెలిసిందే. ట్యాంక్ బండ్ స‌మీపంలోని నెక్లెస్ రోడ్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వరకు వాహనాల రాక‌పోక‌ల‌పై విధించిన ఆంక్ష‌లను ట్రాఫిక్ పోలీసులు ఎత్తివేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్‌, హిమాయ‌త్ న‌గ‌ర్‌, బ‌షీర్‌బాగ్ ర‌హదారుల్లో ఆంక్ష‌లు తొల‌గించారు. న‌గ‌రంలోని ఖైరతాబాద్ నుంచి ఐమాక్స్ థియేటర్, మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్ బండ్ ర‌హ‌దారుల్లోనూ ఆంక్ష‌లు ఎత్తివేశారు. ప‌లు ప్రాంతాల్లో వన్ వే రూట్లలోనే వెళ్లాల‌ని సూచించిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు అన్ని రూట్ల‌లోనూ వాహ‌నాలకు అనుమ‌తిస్తున్నారు.

  • Loading...

More Telugu News