: ఉప్పొంగుతున్న మూసీ నది... ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసే అవకాశం, ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు


గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ఉదయం వరద కొంచెం తగ్గినప్పటికీ ప్రాజెక్టులోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ఇప్పటికే 643 అడుగులకు పైగా నీరు చేరింది. వస్తున్న వరదతో మరో రెండు గంటల్లోనే పూర్తి నీరు చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు తెరచి నీటిని కృష్ణా నదిలోకి వదులుతామని అధికారులు తెలపడంతో, దిగువ గ్రామాల్లోని ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలకు వెళ్లిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ ఉదయం 12 గంటల్లోపు మూసీ ప్రాజెక్టు గేట్లను తెరవనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News