: మధ్య తరగతి అమ్మాయిలే టార్గెట్.. కేర్‌టేకర్ పేరుతో విదేశాల్లోని వేశ్యా గృహాలకు మహిళలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్


కేర్‌టేకర్ల ఉద్యోగాల పేరుతో మహిళలను విదేశాలకు తరలించి అక్కడి వేశ్యా గృహాలకు అమ్మేస్తున్న ముఠాలోని మరో సభ్యుడు పోలీసులకు చిక్కాడు. బుధవారం సాయంత్రం సత్యవేడులో ముఠాకు చెందిన మరో సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తాటికాయలవారి పాలేనికి చెందిన ఎస్.నాగసోమేశ్వరరావు, అలియాస్ బాబు(33)ను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక సీఐ నరసింహులు తెలిపారు. మధ్య తరగతి మహిళలకు డబ్బులు ఎరవేసి విదేశాల్లోని బ్రోతల్ హౌస్‌లకు వారిని ముఠా సభ్యులు విక్రయిస్తున్నారని సీఐ తెలిపారు. విమానాశ్రయంలోని కిందిస్థాయి ఉద్యోగులను లోబర్చుకున్న ముఠాసభ్యులు తమకు ఆటంకాలు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టూరిజం వీసాతో మహిళలను విదేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కాలపరిమితి పూర్తయిన తర్వాత బాధిత మహిళలు స్వదేశం రాలేక అక్కడే ఉంటూ వేశ్యాగృహాల్లో మగ్గిపోతున్నారని సీఐ వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన పాండ్యరాజన్, రఫీ, ఫాతిమా, తూర్పుగోదావరికి చెందిన ఏసుప్రేమ అలియాస్ భీమవరం ఆంటీలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News