: లారీ డ్రైవర్ కుమార్తెకు ఎంసెట్-3లో 8వ ర్యాంక్.. సత్తాచాటిన ఆదిలాబాద్ అమ్మాయి


కష్టపడే తత్వం.. సాధించాలనే పట్టుదల ముందు పేదరికం, కుటుంబ పరిస్థితులు అడ్డుగోడలు కాబోవని నిరూపించిందో లారీ డ్రైవర్ కుమార్తె. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీఎస్ ఎంసెట్-3లో ఆదిలాబాద్‌కు చెందిన నూజ్‌హత్ ఫాతిమా 8వ ర్యాంకుతో సత్తా చాటింది. లారీ డ్రైవర్ అయిన సయ్యద్ అక్తర్‌ హుస్సేన్‌కు ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయి బీటెక్ పూర్తి చేయగా, రెండో అమ్మాయి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మూడో అమ్మాయి ఫాతిమా ఎంసెట్‌లో టాప్‌టెన్‌లో ర్యాంకు సాధించి తానేంటో నిరూపించింది. గతంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్‌లో 68వ ర్యాంకు సాధించిన ఫాతిమా టీఎస్ ఎంసెట్-1లో 51, ఎంసెట్ -2లో 77వ ర్యాంకు సాధించింది. లారీ డ్రైవర్‌గా కష్టపడుతూనే కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్న తండ్రి కష్టాన్ని గుర్తించిన కుమార్తెలు అందుకు తగిన ప్రతిభతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

  • Loading...

More Telugu News