: తమిళనాడులో కొనసాగుతున్న బంద్.. విజయ్‌కాంత్ నిరాహార దీక్ష
కావేరీ జలాల వివాదం కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కావేరీ జలాల విడుదలను నిరసిస్తూ ఇటీవల బెంగళూరులో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు తమిళనాడుకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా తమిళులపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తమిళులపై కన్నడిగుల దాడిని నిరసిస్తూ నేడు తమిళనాడులో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతోపాటు సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలిపింది. సినీ ప్రముఖులు షూటింగులను నిలిపివేశారు. ఇక పార్టీ కార్యాలయంలో డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ నిరాహారదీక్ష చేపట్టారు.