: నేడు ముంబైలో పర్యటించనున్న గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు(శుక్రవారం) ముంబైలో పర్యటించనున్నారు. ప్రముఖ గాయని, సంగీత సామ్రాజ్ఞి సుబ్బులక్ష్మి శతాబ్ది ఉత్సవాల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుతో భేటీ అవుతారు. పలు అంశాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.